Header Banner

రాష్ట్రపతి భవన్‌లో రేపు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. దేశ వ్యాప్తంగా ఆయన క్రేజ్‌!

  Sun Apr 27, 2025 12:56        Politics

రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan)లో సోమవారం పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం జరగనుంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ పద్మవిభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ దంపతులు సోమవారం ఢిల్లీ రానున్నారు. కాగా నటన అనేది ఉద్యోగంలా భావించకుండా కళగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ. అటు నటన, ఇటు రాజకీయాలు, మరో పక్క వైద్యరంగంలో సేవలు.. ఇలా ఐదు దశాబ్దాల నుంచి విరామం లేకుండా పని చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేషసేవలు అందిస్తున్న బాలకృష్ణ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్‌ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

 

ఇది కూడా చదవండి: "ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్".. కస్టమర్లకు జాక్‌పాట్.. ఐఫోన్, AC లలో భారీ డిస్కౌంట్! ఆ కార్డుంటే బంపర్ ఆఫర్..

 

అప్పుడెప్పుడో 1960ల్లో సీనియర్ ఎన్టీఆర్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నందమూరి వంశానికి పద్మ పురస్కారం లభించడం ఇదే. ఐదు దశాబ్దాల బాలకృష్ణ నట జీవితంలో భారీ విజయాలే కాదు.. కొన్ని పరాజయాలూ ఉన్నాయి. అపజయానికి ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. విజయానికి దగ్గిర దారులు వెదుక్కుంటూ రాజీ పడలేదు. డైలాగ్‌ చెప్పడంలో బాలకృష్ణది ఒక ప్రత్యేక ఒరవడి. కళ్ల వెంట నిప్పులు కురిపిస్తూ బేస్‌ వాయిస్‌లో ఆయన తెరపై డైలాగులు చెబుతుంటే థియేటర్లు దద్దరిల్లి పోతుంటాయి. తండ్రి ఎన్టీఆర్‌లా బాలకృష్ణకు కూడా తెలుగు భాష అంటే ఎంతో గౌరవం. సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడే పదాలతో డైలాగులు చెప్పే బాలయ్య నిజజీవితంలో కూడా తన ఆహార్యం, అలవాట్లతో ప్రత్యేకంగా కనిపిస్తారు. క్రమశిక్షణకు ప్రాణం ఇస్తారు బాలకృష్ణ. అలాగే ఆయనది ముక్కుసూటితత్వం. నాన్చుడు వ్యవహారం ఆయనకు నచ్చదు. మనసులో ఏముందో అది బయటకు చెప్పడం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం అలవాటు. ఆరు పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్‌కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా ఆయన క్రేజ్‌ సంపాదించుకున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Balakrishna #Atchannaidu #Telugudesam #Jagan #YSRCP #APPolitics #TDP #AndhraPrades